హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేరుపాలెం తీరంలో పర్యాటకుల సందడి

WG: ప్రముఖ పర్యాటక కేంద్రమైన పేరుపాలెం బీచ్ ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి తరలివచ్చిన సందర్శకులు, కుటుంబ సభ్యులు సముద్ర కెరటాల మధ్య ఉత్సాహంగా గడిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీరంలో పోలీసులు, రక్షక సిబ్బంది నిరంతర నిఘా ఉంచి పర్యాటకులను అప్రమత్తం చేశారు.