హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టు మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి: MPDO

SRD: కొండాపూర్ మండలంలోని గ్రామాల్లో ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం కింద 100% రాయితీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్నట్లు MPDO సౌమ్య శ్రీ తెలిపారు. అర్హులైన BC మహిళలు సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 55 ఏళ్ల వయసున్న వితంతు, ఒంటరి, దివ్యాంగ, అనాథ మహిళలు అర్హులని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.