హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

AKP: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఇన్‌ఛార్జ్ డీఎస్పీ జీ.ఆర్.ఆర్. మోహన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రకాశం పంతులు చూపిన ధైర్యసాహసాలు, నిజాయితీ నేటి తరానికి ఆదర్శమన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.