హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్‌లో ఘనంగా ఆంధ్రకేసరి జయంతి

శ్రీకాకుళం: స్వాతంత్య్ర సమరయోధుడు, రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగూటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూల మాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు.