హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

TPT: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వీరికి వేదమంత్రోచ్ఛారణలతో స్వామివారి ఆశ్వీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి సేవలో TG హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు, మంత్రి జనార్దన్‌రెడ్డి, TDP ఎమ్మెల్యే గల్లా మాధవి, BCY పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, YCP ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.