హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్డాన్ సెర్చ్.. 25 వాహనాలు సీజ్..!

BPT: బాపట్ల మండలంలోని కొత్తపాలెం, కుక్కలవారిపాలెం గ్రామాల్లో పోలీసులు ఆదివారం ఉదయం విస్తృత తనిఖీలు చేపట్టారు. నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ చంద్రమౌళి తెలిపారు. తనిఖీల్లో 25 అనుమానిత వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. డ్రగ్స్‌ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.