హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిలకలూరిపేటలో ఫోర్జరీ వ్యవహారం కలకలం

PLD: చిలకలూరిపేట నాదెండ్ల ఎస్సీ కాలనీకి చెందిన కొరివి ఎలీషాబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 15 ఏళ్లుగా స్థలంలో నివాసం ఉంటున్నట్లు పేర్కొంటూ VRO అబ్దుల్ బాషా సంతకాన్ని ఫోర్జరీ చేసిన పొజిషన్ సర్టిఫికెట్‌ను బ్యాంకులో సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమానంతో బ్యాంకు అధికారులు ఆరా తీయగా సంతకం తనది కాదని VRO స్పష్టం చేశారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.