KNR: పాలల్లో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానకొండూరు (M) రంగంపేటలో స్ఫూర్తి అనే ఇంటర్ విద్యార్థిని వారం క్రితం పురుగుమందు తాగింది. ఈ విషయాన్ని స్ఫూర్తి దాచడంతో పరిస్థితి తీవ్రంగా విషమించింది. కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
పురుగుమందు తాగి ఇంటర్ విద్యార్థిని మృతి


