HYD: గుడిమల్కాపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ షాప్ పక్కనే మరికొన్ని గోడౌన్స్ ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారు. కాగా.. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
గుడిమల్కాపురంలో భారీ అగ్నిప్రమాదం


