మెదక్: గిరిజన సేవాలాల్ జగదాంబ దేవాలయాల పూజారులకు దీపధూప పథకం అమలు చేయాలని కోరుతూ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావుకు పూజారులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మాపూర్ సర్పంచ్ నవీన్ గౌడ్, జిల్లా ఎస్టీ మోర్చా కార్యదర్శి శివుల నాయక్, జిల్లా ఎస్టీ మోర్చా సామాజిక మాధ్యమాల సమన్వయకర్త నరేష్ నాయక్, గుడి పూజారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'దీపధూప పథకం అమలు చేయాలి'


