హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మునిగిన బోటు.. ఐదుగురు మత్స్యకారులు సేఫ్

విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు బయలుదేరిన ఒక మెకనైజ్డ్ బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. హార్బర్‌కు 2.8 నాటికల్ మైళ్ల దూరంలో పడవ రాతిని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ పడవలో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సకాలంలో అప్రమత్తమై సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో పడవ సహాయంతో ఫిషింగ్ హార్బర్‌కు జాలర్లు చేరుకున్నారు.