హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రకేసరి సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

ప్రకాశం: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజా నాయకుడిగా ప్రకాశం పంతులు చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నారు.