హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్

ADB: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్‌ అర్హత పరీక్ష కేంద్రాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, DSP జీవన్ రెడ్డితో కలిసి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కొనసాగుతున్న తీరును పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.