SKLM: ఆమదాలవలస పట్టణంలో ఆదివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శివభక్తులు కావడి యాత్ర నిర్వహించారు. శ్రీ విజయ దుర్గ భవాని ఆలయం నుంచి శివాలయం వరకు భక్తిశ్రద్ధలతో యాత్ర సాగింది. కాశీ నుంచి తీసుకొచ్చిన గంగా జలాన్ని కావడిలోకి మోసుకెళ్లి శివాలయంలో పరమశివుడికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులు ‘ఓం నమఃశివాయ’ నామస్మరణతో యాత్ర కొనసాగించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శివనామస్మరణతో కావడి యాత్ర


