SKLM: లావేరు శాఖా గ్రంథాలయంలో ఆదివారం ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నిర్వహించిన వకృత్వ పోటీలో విజేత రోహిత్ కు గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు బహుమతిని అందజేశారు. అంతకుముందు విద్యార్థులతో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గ్రంథాలయంలో ‘చదవడం మాకిష్టం’


