హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

AP: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు, మంత్రి జనార్దన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తదితరులు స్వామివారిని వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.