హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులకు ప్రత్యేక UDID శిబిరం: MPDO

MDK: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 25న నిర్వహించనున్న ప్రత్యేక శిబిరాన్ని దివ్యాంగులు ఉపయోగించుకోవాలని ఎంపీడీవో రాజిరెడ్డి కోరారు. 26న మిలాద్-ఉన్-నబీ ఉన్నందున శిబిరాన్ని ఒకరోజు ముందే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని UDID కార్డ్ ధ్రువీకరణతో పాటు చేయూత పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.