హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల భద్రతకు పోలీసుల ప్రత్యేక చర్యలు

సత్యసాయి జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ విస్తరించారు. సరిహద్దుల్లో తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఏటీఎంలు, గుడుల వద్ద పహారా పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు.