NTR: ఈ నెల 24న ఉపరాష్ట్రపతి విజయవాడ విమానాశ్రయానికి రానున్న నేపథ్యంలో భద్రతా, ప్రోటోకాల్ ఏర్పాట్లను పూర్తి చేయాలని కృష్ణా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ నవీన్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఎస్పీజీ అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. రూట్ భద్రత, ట్రాఫిక్, కాన్వాయ్, వైద్య, అగ్నిమాపక ఏర్పాట్లపై శాఖలు సమన్వయంతో దృష్టి సారించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉప రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు


