హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

SRD: పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ గుర్తుతెలియని వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే తమను సంప్రదించాలని పటాన్‌చెరు పోలీసులు విజ్ఞప్తి చేశారు.