KDP: దేవునికడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జీర్ణోద్ధారణ, అష్టబంధన మహా సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో మహాసంప్రోక్షణ ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 26న మధ్యాహ్నం నుంచి స్వామి, అమ్మవార్ల మూలవిరాట్ దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి దేవుని కడపలో పూజలు


