PPM: కురుపాం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను అధికారులు ఆదివారం ప్రదర్శించారు. మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల వద్ద జాబితాను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే అధికారులకు తెలియజేయాలని ఎంపీడీవో జె. ఉమామహేశ్వరి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల జాబితా ప్రదర్శన..


