హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రత్యేక అలంకరణలో గంగమ్మ తల్లి

PLD: పిడుగురాళ్లలో వేంచేసి ఉన్న గంగమ్మ తల్లి దేవాలయంలో శ్రావణమాస రెండవ ఆదివారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఆలయ పూజారి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి డ్రాగన్ ఫ్రూట్, బత్తాయి పండ్లు, అరటి, పైనాపిల్, ద్రాక్షాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొక్కెర కొండలు ఆధ్వర్యంలో అమ్మవారికి తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించారు.