ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి సుంకరవారి తోటలో అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార స్థావరంపై ఏలూరు రూరల్ CI రామకృష్ణ దాడి చేశారు. సమాచారం మేరకు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఇద్దరు నిందితులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు CI తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులో వ్యభిచార స్థావరంపై దాడి


