హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూల్ ఆవరణలో పాము.. విద్యార్థుల్లో భయాందోళన

NRML: నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో పాము కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో గల రంద్రం నుండి పాము బయటకు రావడంతో దానిని చూసిన విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించడంతో కాలనీకి చెందిన పాములు పట్టే వ్యక్తి బాబన్న అక్కడికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. దీంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.