హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగం పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

KRNL: బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారంటూ కడపకు చెందిన తుపాకుల గణేశ్‌రెడ్డిపై ఆదోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్టీసీ కాలనీకి చెందిన సాయినాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం పేరుతో తనను మోసం చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు సీఐ రాజశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.