KDP: సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలోని APSP 11వ పోలీస్ బెటాలియన్‌లో ఆదివారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ కె. ఆనందరెడ్డి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కె. వెంకటప్ప ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ప్రకాశం పంతులు జయంతి వేడుకలు


