ADB: బజార్ హత్నూర్ మండలం దేగామ గ్రామానికి వచ్చే రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు రోజురోజుకూ పెద్దవిగా మారడంతో ప్రమాదాల భయం నెలకొంది. ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పే పరిస్థితి ఏర్పడుతోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా దేగామ రహదారి


