హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురికి కాలువలో మిషన్ భగీరథ పైప్‌లైన్లు

NLG: గుర్రంపోడు మండలం పల్లెపహాడ్‌లోని ఎస్సీ కాలనీలో మురుగునీటి కాలువల్లోనే మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్నాయి. నిండా మురుగునీరు ఉండగా అందులోంచి తాగు నీటి నల్లా పైపులు ఇంటిటికీ అమర్చారు. చాలా సార్లు నీరు ఎర్రగా మురికిగా వస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీకి మరో నీటి వనరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.