హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెద్ద తుంబలంలో తాగునీటి కష్టాలు

KRNL: ఆదోని మండలం పెద్ద తుంబలంలో తాగునీటి కొరతతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వీధిలో మినీ ట్యాంకులు ఏర్పాటు చేసినా జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా జరగడం లేదు. దీంతో మహిళలు, పిల్లలు తోపుడుబండ్లతో కొళాయిల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అధికారులు స్పందించి నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.