హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోర్టు కేసుల పురోగతిపై అధికారులతో సీపీ సమీక్ష

KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోర్టు డ్యూటీ అధికారులతో CP గౌష్ ఆలం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు సంబంధిత విధులు, పెండింగ్ కేసులు, సమన్లు, వారెంట్ల అమలు, ట్రయల్ కేసులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. సమన్లు జారీ, అమలు, కోర్టు వారెంట్ల అమలు, ట్రయల్ కేసుల పురోగతి, ఈ-పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.