హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHNG: చౌటుప్పల్‌లోని విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతులు చేసేందుకు ఇవాళ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ రాజుల సతీశ్ శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. జిబ్లిక్‌పల్లి, తంగడపల్లి, చిన్నకొండూరు వ్యవసాయ ఫీడర్లకు అంతరాయం కలుగుతుందని చెప్పారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.