హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెన్నాకు జలకళ.. రైతుల్లో ఆనందం

KDP: చెన్నూరు మండలంలోని పెన్నా నదికి మైలవరం డ్యామ్‌ నుంచి నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు చుక్క నీరు లేక ఎండిపోయిన నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం కనిపించడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బోర్లు, మోటార్లకు సమృద్ధిగా నీరు అందడంతో సాగుకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.