హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

SRPT: నూతనకల్ మండలం మిర్యాలలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు శనివారం తెలిపారు. మిర్యాల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కృష్ణారెడ్డి, లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన 25 క్వింటాళ్ల బియ్యాన్ని తన ఇంటి వద్ద వాహనంలో లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.