హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ శనివారం తనిఖీ చేశారు. మెనూ ప్రకారం.. విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు తెలిపారు. భోజనం నాణ్యత, నిర్వహణపై ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈఓ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ అనిత ఉన్నారు.