SRCL: చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో శనివారం రాత్రి ఓ కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కకు దూసుకెళ్లిన సంఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. రుద్రంగికి చెందిన సదుల్లా కుటుంబం చందుర్తిలో పెండ్లికి వెళుతుండగా కారు అదుపుతప్పి కందకంలోకి దూసుకెల్లడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
అదుపుతప్పిన కారు ఐదుగురికి తీవ్ర గాయాలు


