మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు బాధిత 2027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహార చెక్కును సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో అందజేశారు. ప్రభుత్వం బాధితులకు మొత్తం రూ.768 కోట్లను పరిహారంగా అందించింది. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, ఒంగోలు MLA శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి MLA ఉగ్ర నరసింహరెడ్డి, మార్కాపురంMLA నారాయణ రెడ్డి, గిద్దలూరు MLA అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ బాధితులకు పరిహారం


