కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి అన్నప్రసాదం ట్రస్ట్‌కు శనివారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. అయినవిల్లికి చెందిన వంట్రపాటి నాగసత్య చందు యాదవ్ రూ. 26,195, దుళ్లకు చెందిన దైవపు శివశంకరరావు రూ.10,001, సిరిపల్లికి చెందిన మట్టపర్తి శివరాజ్ రూ. 10,116 విరాళంగా ఇచ్చారు. ఆలయ అధికారులు దాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అయినవిల్లి అన్నప్రసాదం ట్రస్ట్‌కు భారీ విరాళాలు


