VSP: తగరపువలస చాకలి సంతపేటలో ఒనుము పావని (27) శనివారం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందారు. భర్త తరఫు బంధువుల వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. బావ, తోటికోడలు వేధింపులపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. పావని భర్త వేణుగోపాల్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. భీమిలి పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
వివాహిత అనుమానాస్పద మృతి


