హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

అన్నమయ్య: జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకుడు యల్లటూరు శివరామరాజు కేక్ కట్ చేసి, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, ప్రజలకు కేక్ పంపిణీ చేశారు. చిరంజీవి ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు.