W.G: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడు ZP హైస్కూల్ HMపై విద్యార్థి తల్లిదండ్రులు దాడి చేయడాన్ని PDF MLC బొర్రా గోపీమూర్తి తీవ్రంగా ఖండించారు. శనివారం భీమవరంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, వైద్యుల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయుల రక్షణకు కఠిన చట్టాలు తేవాలి: MLC


