హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అంగన్వాడీ టీచర్లకు నియామక పత్రాలు అందజేత

కోనసీమ: తల్లి తర్వాత తల్లిలా అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు చిన్నారులను తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేటలో నూతనంగా నియమితులైన అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, జీతాలు పెంచడంతో పాటు పలు సౌకర్యాలు కల్పిస్తోందన్నారు.