VZM: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనముల్లుపేటకు చెందిన ఉపాధ్యాయుడు కౌలూరు రాజేష్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. శనివారం విజయనగరం పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయనను అభినందించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యా వనరుల శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఏపీ నుంచి రాజేష్ ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాజేష్ ఎంపిక


