హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు ఐదు మొబైల్ ఫోన్లు అందజేత

NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను శనివారం సీఐ సత్యనారాయణ గౌడ్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి 5 మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి వారికి అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రాములు, బాధితులు లక్ష్మి, నరేష్, సుజాత తదితరులు పాల్గొన్నారు.