NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిరంజీవి స్వయంకృషితో సినీరంగంలో అగ్రస్థానానికి ఎదిగి, బ్లడ్ బ్యాంక్ స్థాపించి, ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేశారని కొనియాడారు. అనంతరం వృద్ధులకు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'చిరంజీవి సేవా స్ఫూర్తి అభినందనీయం'


