హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మధ్యప్రదేశ్ బేతులు జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న ట్రక్కును వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.