హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

అన్నమయ్య: శ్రావణ మాసం రెండవ శనివారం సందర్భంగా పెద్దమండ్యంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ శనివారాన వైష్ణవ ఆరాధన ఎంతో శ్రేయస్కరమని, వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు అర్చకులు తెలిపారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.