హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్లాస్టిక్ వినియోగం తగ్గింపుపై అవగాహన

KRNL: మంత్రాలయం టౌన్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని టీడీపీ ఇంచార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపుపై అవగాహన కల్పించారు. అనంతరం పీఎం సూర్యఘర్ సోలార్ వ్యవస్థను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఆర్‌ఓ రమాదేవి, ఎంపీడీఓ నూరజహాన్ తదితరులు పాల్గొన్నారు.