హైదరాబాద్: 28°C
క్రీడలు

స్టీవ్ స్మిత్ తీరుపై విమర్శలు

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లను డీఆర్ఎస్ తీసుకునేలా స్మిత్ రెచ్చగొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అంపైర్లు జోక్యం చేసుకుని స్మిత్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్మిత్ ప్రవర్తనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.