హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ పేరుతో వేధింపులు.. కేసు నమోదు

కృష్ణా: మైలవరం మండలంలో ప్రేమ పేరుతో మైనర్ బాలికను ఏడాది కాలంగా వేధిస్తున్న యువకుడిని పోలీసులు శుక్రవారం  అరెస్టు చేశారు. గతంలో పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాకపోవడంతో, బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై BNS, POCSO చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికలు, మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని SI సుధాకర్ స్పష్టం చేశారు.